Thursday 8 November 2007

దీపావళి..

పులివెందుల నగరిగుట్టలో ఉంటున్న రోజులవి. నాన్నగారు రాజారెడ్డి బ్యాంకులో (స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాని అక్కడ అలాగే పిలుస్తారు, కంగారు పడొద్దు) సేల్స్ ఆఫీసర్‌గా ఉండేవారు. ప్రతీనెలా సరుకులు అప్పుతెచ్చే అంగడిలోనే దీపావళికి పటాకులు కూడా తెచ్చుకోవడానికి రెడీ అయ్యాము. తెచ్చుకున్నాక పంపకం ఓపెద్దపని. నాన్నగారు కూచుని ఐదుమందికీ వారివారి అభిరుచిని బట్టి పంచేవారు. తీరా కాల్చవచ్చేటప్పటికి ఒకళ్ళదొకళ్ళు లాక్కోడం, ఒకళ్ళకోసం ఇంకొకరు త్యాగం.. అబ్బో.. పెద్ద తతంగం. అప్పట్లో మహదానందింపజేసిన ఐటమ్స్ కొన్ని ఇప్పుడస్సలు కనిపించట్లేదు. సిసింద్రీలు, చిన్న సీసా మూత ఆకారంలో ఉండే విమానాలు, టెలిఫోను, కుండపటాకి ఇంకా ఆ మధ్యలో స్టాండర్డు వాడు వదిలిన సబ్‌మెరైన్ లాంటివి. చేత్తో చేసిన బురుజులు (చిచ్చుబుడ్లు) కూడా చాలా బావుండేవి. అప్పట్లో నూటపదిహేను రూపాయలు పెట్టి తెచ్చుకున్న పటాకులు అమ్మా నాన్నా నేను తమ్ముడు చెల్లెలు కసిదీరా కాల్చాక కూడా ఇంకా కొన్ని మిగిలాయి. అప్పటికి అక్కడే ఉన్న మా పెద్దనాన్నగారు దీపావళి మహ బాగా జరిపించేవారు. నేను 1000 సరం మొట్టమొదట చూసిందీ కాల్చిందీ ఆయన పుణ్యమే.
1990-91

6 comments:

చదువరి said...

ఇప్పుడో.. వెయ్యి రూపాయలు పట్టుకెళ్తే, రెండు చేతుల నిండా తెచ్చుకోడానికొస్తున్నాయి.

Anonymous said...

అదేం బుర్రో కానీ. పులివెందుల పేరు చూడగానే ఏ ఫ్యాక్షన్ గొడవల్లో బలైపోయిన కుటుంబం గురించో అనుకున్నా. ఇలాంటివి ఓ వందొస్తే గానీ ఫ్యాక్షన్ ఇమేజీ వున్న ఊర్ల పేర్లు మారవు.

ఇప్పుడంతా తారుమారు.
బ్యాగు నిండా డబ్బులు..
జేబు నిండా టపాసులు.

-- విహారి

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

వార్నీ...రాజారెడ్డి బ్యాంకా...!మరిప్పుడు వైయస్ బ్యాంకు జగన్ బ్యాంకులు కూడ ఉన్నాయా కడప లో..!?

Unknown said...

జల్లెడ లో ...
"పులివెందులా " అని చూసి ఫాక్షణ్ అనుకున్నా
హమ్మయ్యా...

రాధిక said...

"1000 సరం" అంటే ఏమిటి?

కందర్ప కృష్ణ మోహన్ - said...

రాధిక గారూ
అది థౌజండ్ లార్ అని అర్థం...

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...