Monday 11 June 2007

శ్రీదేవి పోలిక

మ్మేయ్! నువ్ శ్రీదేవి మాదిరుండావంట, అరుణని పిల్చి చెప్పింది షకీలా. ఎవురనింది? అరుణ ప్రశ్నించింది. కృష్ణమోహనే - షకీలా సమాధానం. ఊఊఊఊఊ......................... ఏడ్చుకుంటూ కొండమ్మ టీచర్ దగ్గరకు పోయి అదేమాట చెప్పింది అరుణ. టీచర్ నన్ను పిలిచి - ఏమిరా వళ్ళు పొగరెక్కిందా అని నా చేయి చాపించి తుమ్మకర్రతో రెండు దెబ్బలేసింది. తట్టు తేలింది. అరుణ ఏడుపు ఇంకా ఎక్కువైంది. షకీలా నోటికి చెయ్యడ్డం పెట్టుకుని నవ్వుతూ కూర్చుంది.

స్థలం - డబ్బారేకుల షెడ్డు స్కూలు - ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లోపల - శంకరాపురం - కడప
1982 - 5వ తరగతి

11 comments:

త్రివిక్రమ్ Trivikram said...

హహహహ!

ఈ చిట్టి టపాలోని మీ చిన్నప్పటి అనుభవం చదివి నేను కూడా నవ్వుతూ కూర్చున్నా. చెయ్యడ్డం పెట్టుకోలేదండోయ్!

కానీ కృష్ణమోహన్ అన్న పేరు వినగానే అరుణ ఎందుకేడ్చిందో నాకర్థం కాలేదు సార్!

Hari Mallepally said...

inthaki, aruna, sridevi laaga undaaa leka uttinea abbaddam chepaara?
:-)

spandana said...

"శ్రీదేవి మాదిరుండావంట" అని చెప్పగానే అరుణ ఎందుకేడ్చిందబ్బా! "ఆనంద బాష్పాలా?" లేక ఆ శ్రీదేవి మన శ్రీదేవి కాదా?

--ప్రసాద్
http://blog.charasala.com

కందర్ప కృష్ణ మోహన్ - said...

త్రివిక్రమ్ గారూ,

కృష్ణమోహన్ అన్న పేరు విన్నందుకు కాదండీ, సినిమా హీరోయిన్తో పోల్చినందుకే....

ప్రసాద్ గారూ,
బహుశా అప్పటికి సినిమా ఫీల్డ్ అంటే ఉన్న అసహ్యం కారణం కావచ్చు....

హరినాథ్ గారూ,
మనఃస్ఫూర్తిగానే అన్నానండీ!

రానారె said...

మ్మేయ్! -- భలే పదం. ఈ పదప్రయోగం విహారిగారి బ్లాగులో చూశానిది.

కందర్ప కృష్ణ మోహన్ - said...

రానారె గారూ
ఇంతదాకా ఎదురు చూసింది మీ స్పందన కోసమే....
థాంక్యూ....

రాధిక said...

మిమ్మలిని కొడుతున్నప్పుడు అరుణ ఎందుకేడిచిందో నాకు ఇంకా[మీరేదో వివరణ ఇచ్చినా కూడా]అర్దం కాలేదు.

కందర్ప కృష్ణ మోహన్ - said...

రాధిక గారూ
మనం ఏడుస్తున్నా మళ్ళీ మనవల్ల క్లాస్మేట్ కి దెబ్బలు తగిలాయనే బాధతో కావచ్చు.

rākeśvara said...

బాగుందండి.
నేనింకా షకీలా ఏడుస్తుందని అనుకున్నా.

కందర్ప కృష్ణ మోహన్ - said...

షకీలాకి తరవాత రోజు జ్వరమే వచ్చేసింది! (అందుకే అంటే అది అతిశయోక్తి అవుతుందిగా)

e.bhaskaranaidu said...

I totally enjoy your child experiences. I too have some experiences.

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...