Thursday 12 July 2007

శంకరయ్య సార్...

ఆయన మా మంచి హెడ్మాస్టర్. నా 6-7 తరగతుల కాలంలో ఆయనతో కలిసి చదువుకునే అదృష్టం కలిగింది. అలా ఎందుకన్నానంటే ఆయన మాతో అంతగా కలిసిపోయేవారు. వాళ్ళబ్బాయి మధుసూదన్ నా సహచరుడే. ఆయన బోధించే ఇంగ్లీషు, సోషలే కాకుండా వాటికి సంబంధించిన ఎన్నో వింతలు విశేషాలను ఎంత ఆహ్లాదంగా వివరించేవారంటే బడి అయిపోయి ఇంటికెళ్ళాక మళ్ళీ రేప్పొద్దున్న బడికెంత తొందరగా పోదామా అనిపించేంత!! ఆయన ఎంతో ఆప్యాయంగా "ఒరేయ్ కేకే " అని పిలిచిన పిలుపు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది............

స్థలం - PSUP స్కూల్ - మన్నూరు - రాజంపేట - కడప జిల్లా
1983-85

2 comments:

కొత్త పాళీ said...

మీరీ కథకాని కథల్ని ఇంకొంచెం పొడుగ్గానూ, మరికొంత తరచుగానూ రాయాలని ప్రార్ధన. కష్టపడి బ్లాగు తెరిచినందుకు ఒక నిమిషమైనా చదువుకునే సరుకు లేకపోతే మళ్ళీ రాబుద్ధి కాదు.

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఎంతమాట...
శిరసావహిస్తాను...కృతజ్ఞతలు..

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...