Monday 18 June 2007

సమఉజ్జీలు

నేను, నరసింహారావు, ఎస్సై గారబ్బాయి ప్రకాష్, నాగసుబ్బమ్మ, చిట్టెమ్మ - 4 నుంచి 7 వ తరగతి వరకు (5 కాక) సమఉజ్జీలము.

నాగప్రసాద్ అని పోలియో వల్ల కాళ్ళు సచ్చుబడినా, మానసికంగా పూర్తి ఫిట్ నెస్ తో ఒక తెలివైన అబ్బాయుండేవాడు. తన అన్నయ్య రామకృష్ణ అనీ మాకంటే ఒక తరగతి పెద్ద - మేమిద్దరం స్నేహంగా ఉంటే సహించలేకపోయేవాడు. కారణం ఈనాటికీ నాకు అర్థం కాలేదు.

ఇంకా, పిచ్చయ్య, నారాయణ, మిరియాల నరేంద్ర, మిరియాల శంకరయ్య, ఖాదర్ బాషా, గంగయ్య, మల్లయ్య, అయోధ్యరామయ్య, మోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, అబ్దుల్, హెడ్మాస్టర్ గారబ్బాయి మధుసూదన్, వెంకట సుబ్బయ్య, శిలార్ బీ వగైరాలంతా సహవాసులు.

వీరిలో శిలార్ బీ ప్రత్యేకత ఏమిటంటే నేను పాడే శంకరాభరణం పాటలంటే చెవి కోసుకునేది. వాళ్ళ అమ్మ కువైట్ నుంచి పంపిన లిప్ స్టిక్ తో తనే స్వయంగా నాకు మేకప్ చేసేది (పాటల నాణ్యతకీ దానికీ ఏమి సంబంధమో 4వ తరగతికి ఏం తెలుస్తుంది!)

కమరకట్టలు - బిక్కిపళ్ళు అప్పటి ఇంటర్వెల్ కాలక్షేపాలు!

స్థలం - PSUP స్కూల్ - మన్నూరు - రాజంపేట - కడప జిల్లా
1980-84

3 comments:

Naga said...

నాలుగో తరగతి అయినా కొంత తెలుస్తుంది :o)

కందర్ప కృష్ణ మోహన్ - said...

హి..హి..హి

Happy World said...

బాగుంది
Santhosh
http://santhlavvi.googlepages.com

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...