Saturday 16 June 2007

తెలుగు మాస్టారు

ఏ ఊర్రా మనది? కంచుకంఠం మోగింది - ఒకటే దడ.. క్లాసు 1.30 కి అయితే నేను 1.45కి హాజరయ్యాను. కడప సార్ - అన్నాను. క్లాసంతా గొల్లుమంది. ఆయన కూడా చిరు మందహాసంతో - రోజూ కడప నుంచి వస్తాండావేమిరా - అన్నారు - లేదు సార్ నేను పుట్టిన ఊరు చెప్పాను అన్నాను. గొప్పోడివిరా, లోపలికిరావోయ్ అరిచారు.

శ్రీ సుబ్బరాజ గారు తెలుగు పండిట్ - కార్వేటినగరం నుంచి కొత్తగా బదిలీ అయి వచ్చారు.
స్థలం - PSUP స్కూల్ - మన్నూరు - రాజంపేట - కడప జిల్లా
1983 - 6వ తరగతి

No comments:

ఒక ఉద్యోగానుభవం.....

  సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...